న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బలంగా ఉన్న కొన్ని వర్గాల ఓటు బ్యాంకు మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మళ్లిందని, అందుకే ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రతికూల ఫలితాలు వచ్చాయని సీనియర్ కాంగ్రెస్ నేత, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు.
ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను ఆదరిస్తూ వచ్చిన వర్గాలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మళ్లడం తమకు అంతుబట్టకుండా ఉందన్నారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీ వచ్చిన రాయపాటి బుధవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించారు.
అనంతరం రాయపాటి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇందిరమ్మ కాలం నుంచి ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. బీసీల్లో 85 శాతం టీడీపీకి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు అదే ఎస్సీ, ఎస్టీ, బీసీలు జగన్ వైపు వెళ్లారు. జగన్ వారి మనిషని అంటున్నారు. ఆయన ప్రజల మనిషని వారే చెబుతున్నారు. ఇంత తక్కువ సమయంలో ఒక్కసారి ఇంత మార్పు రావడం మాకు ఆశ్చర్యంగా ఉంది’ అని ఆయన చెప్పారు.
‘చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయన సామాజికవర్గానికి చెందిన వారు పీఆర్పీకి ఓటేశారు. ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఆ వర్గం ప్రజలు మా పార్టీకి ఓటేయలేదు. ఇక కమ్మ వర్గానికి చెందిన ప్రజలెవరూ టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడంలేదు’ అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరి స్థితి ఎదుర్కొంటోందని సోనియాకు వివరించానని, తక్షణమే సంస్కరణలు చేపట్టాలని కోరానని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితులపై దృష్టి సారిస్తామని సోనియా చెప్పారన్నారు. ఆగస్టు తర్వాత రాష్ట్రంలో మార్పులు ఉంటాయని వెల్లడించారు.

No comments:
Post a Comment