Arts Blogs - Blog Rankings U70mm: యడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతు

Sunday, 1 July 2012

యడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదిరింది. అసెంబ్లీలో బీజేపీకి ఉన్న 120 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతునిస్తున్నారు. వీరి జాబితాను యడ్డీ వర్గం నేత జగదీష్ షెట్టర్ ఆదివారం విడుదల చేశారు. ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే 9 మంది మంత్రులు రాజీనామా చేసిన తరుణంలో 51 మంది ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు మద్దుతుగా నిలుస్తున్నారన్న వార్త సీఎం సదానంద వర్గంలో గుబులు పుట్టిస్తోంది. ఈ పరిస్థితి ఇంకెంతవరకు దారి తీస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

No comments:

Post a Comment