హైదరాబాద్: రాజకీయంగా ఎదుర్కోలేక తన పై కుట్రలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ నేత, మత ప్రచారకుడు కె.ఎ.పాల్ ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు తనని అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కుట్రతో తనని కేసులో ఇరికించారని వాపోయారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తే, ఇక్కడ చికిత్స చేయకుండా పిచ్చిఉందని ఎర్రగడ్డకు పంపుతున్నారని ఆరోపించారు. తనకు పిచ్చిలేదన్నారు. పోలీసులు కక్ష గట్టి తనని ఎర్రగడ్డకు తీసుకెళ్తున్నారన్నారు. తనను చంపడానికి కుట్రచేస్తున్నారని పాల్ ఆరోపించారు.

No comments:
Post a Comment