బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కటీఫ్!
ఇకపై రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోనూ ఒంటరి పోరేనని ప్రకటన
అక్కడ ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదంటూ వ్యాఖ్యలు
సవాలుకు సిద్ధమన్న బెంగాల్ కాంగ్రెస్.. దీదీది ద్రోహమంటూ ధ్వజం
ఆమె తప్పేమీ మాట్లాడలేదంటూ తేలిగ్గా తీసుకున్న ఏఐసీసీ
కోల్‌కతా: ఒకవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నుంచి తీవ్ర తలనొప్పులు ఎదుర్కొంటున్న యూపీఏ సంకీర్ణ సారథి కాంగ్రెస్‌కు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గట్టి హెచ్చరిక సందేశం పంపారు. యూపీఏలో తమకు సరైన గౌరవాదరాలు లభించినంతకాలం మాత్రమే సంకీర్ణంలో కొనసాగుతామని స్పష్టం చేశారు.
అంతేగాక, ఇకపై బెంగాల్‌లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించారు. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడి మనుగడ సాగించాలని తాము భావించడం లేదన్నారు. వచ్చే ఏడాది జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను దసరా అనంతరమే నిర్వహించే అవకాశముందని శనివారమిక్కడ భారీ స్థాయిలో జరిగిన పార్టీ అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమత పేర్కొన్నారు. ‘‘లెఫ్ట్ ఫ్రంట్ అధీనంలో ఉన్న జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితిలు, గ్రామ పంచాయతీలను తృణమూల్ నెగ్గాలి. నూతన బెంగాల్‌ను ఆవిష్కరించాలి’’ అన్నారు. అదే సమయంలో, ‘‘రాష్ట్ర ప్రభుత్వంలో బెంగాల్ కాంగ్రెస్ భాగస్వామిగా కొనసాగాలనే భావిస్తున్నాం. కానీ ఆ పార్టీ నేతలు సీపీఎంతో కలిసి మాకు వ్యతిరేకంగా పని చేస్తే మాత్రం సహించేది లేదు’’ అని కూడా ఆమె హెచ్చరించారు.
తృణమూల్ సవాలుకు తాము సిద్ధమేనని బెంగాల్ కాంగ్రెస్ ప్రకటించింది. మమత ఒంటరి పోరు ప్రకటనను విద్రోహ చర్యగా పీసీసీ చీఫ్ ప్రదీప్ భట్టాచార్య అభివర్ణించారు. ‘‘ఒంటరిగా పోటీ చేసే సత్తా మాకూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే తృణమూల్‌కు అధికారమే దక్కేది కాదు’’ అంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్ గొడవలు కుటుంబ కీచులాటలను తలపిస్తున్నాయంటూ సీపీఎం దుయ్యబట్టింది. కాంగ్రెస్‌తో కేంద్రంలో నెయ్యం, రాష్ట్రంలో కయ్యమంటున్న మమత పచ్చి అవకాశవాది అని మండిపడింది. పంచాయతీ ఎన్నికలను ముందుకు జరపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ మాత్రం మమత ప్రకటనను స్వాగతించింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు ఉపసంహరించి ముందస్తు ఎన్నికలు తేవాల్సిందిగా ఆమెను కోరింది. అప్పుడే ప్రజలకు యూపీఏ అసమర్థ పాలన నుంచి ఉపశమనం లభిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎన్డీఏతో పాటు ప్రజలూ సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. ఏఐసీసీ బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి మాత్రం మమత అభ్యంతరకర వ్యాఖ్యలేవీ చేయలేదనడం కొసమెరుపు! కొంతకాలం క్రితం బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, తృణమూల్ విడిగానే పోటీ చేశాయని ఆయన గుర్తు చేశారు.
అవసరమైతే ‘చలో ఢిల్లీ’: మమత
రాష్ట్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపులపై మూడేళ్ల మారటోరియం విధించాలన్న తమ డిమాండ్‌పై కేంద్ర స్పందన కోసం మరింతకాలం వేచి చూస్తామని మమత అన్నారు. వడ్డీ చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో కలిసి చలో ఢిల్లీ పిలుపిస్తామని హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో తామేమీ భిక్ష కోరడం లేదంటూ కటువైన వ్యాఖ్యలు చేశారు.
‘సామాన్యురాలిగా కష్టపడతా’
ముఖ్యమంత్రి పదవిని తనదిగా ఎన్నడూ భావించనని మమత అన్నారు. సీఎంగా గాక ఓ సామాన్యురాలిగానే తాను కష్టించి పని చేస్తానని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మా, మాటి, మనుష్ (తల్లి, భూమి, ప్రజలు) బాగాలేకుంటే... ఏదీ బాగాలేనట్టే. క్రమశిక్షణకు నేను ప్రాణమిస్తాను. యంత్రాంగాన్ని నడపడంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తా. అదే సమయంలో ప్రజలంటే నాకెంతో ప్రేమ. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను’’ అని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తల తప్పుడు ప్రవర్తనను సహించేది లేదన్నారు.

No comments:
Post a Comment