Arts Blogs - Blog Rankings U70mm: ఆర్థిక వ్యవస్థ దుర్బలమే

Thursday, 21 June 2012

ఆర్థిక వ్యవస్థ దుర్బలమే

ఐఎంఎఫ్ బలోపేతంతో సంక్షోభాన్ని నివారించగలం: జీ-20 సదస్సు ధీమా 

- ఆర్థిక మాంద్యం, అవినీతిపై పోరాటానికి కట్టుబడివున్నాం 
- అవినీతి సొమ్మును దాచుకునే అవకాశాలను నిరాకరించాలి 
- నత్తనడకన కోటా సంస్కరణలు: మన్మోహన్ 

లాస్ కాబోస్: ఆర్థిక మాంద్యం, అవినీతిపై పోరాటానికి కట్టుబడి ఉన్నామని జీ-20 దేశాల నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి 450 బిలియన్ డాలర్లు అందించి బలోపేతం చేయటం.. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు, ప్రపంచ సంక్షోభాన్ని నివారించేందుకు తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు బుధవారం మెక్సికోలోని లాస్ కాబోస్‌లో ముగిసింది. ఈ సందర్భంగా ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటన (డిక్లరేషన్)లో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా దుర్బలంగానే ఉందని సదస్సు పేర్కొంది. అయితే.. ప్రపంచ ఆర్థిక సుస్థిరతను పరిరక్షించటానికి అవసరమైన చర్యలను తీసుకోవటంలో అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉందని.. సంక్షోభ నివారణ పరిష్కారంలో ఐఎంఎఫ్ పాత్ర మరింతగా పెరిగిందని వ్యాఖ్యానించింది.

ఆర్థిక విపణుల ఒడిదుడుకుల పరిష్కారంలో, వాణిజ్యాన్ని ప్రోత్సహించటంలో, ఉద్యోగాలను పెంచటంలో ఉమ్మడి చర్యలు చేపట్టాలని సదస్సు పిలుపునిచ్చింది. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దుర్బలంగానే ఉందన్నది సుస్పష్టం. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాల మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉద్యోగాలు, వాణిజ్యం, అభివృద్ధి, పర్యావరణంపైనా ప్రభావం చూపుతోంది. పునరుద్ధరణను బలోపేతం చేయటానికి, ఆర్థిక విపణుల్లో ఒడిదుడుకులను పరిష్కరించటానికి మేం ఉమ్మడిగా కృషి చేస్తాం’ అని ఆ ప్రకటన పేర్కొంది. 

యూరోజోన్‌లో అస్థిరత పరిష్కారం అత్యవసరం: మన్మోహన్ 
‘‘అన్ని దేశాల్లోనూ అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా విధానాలు మారాలన్న అంశంపై సదస్సులో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. చాలా అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్య.. యూరోజోన్‌లో అస్థిరతను పరిష్కరించటం అన్న దానిపైనా అందరూ అంగీకరించారు’’ అని జీ-20 శిఖరాగ్రంలో పాల్గొన్న భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తెలిపారు. ప్రపంచ సంక్షోభాన్ని నివారించేందుకు ఐఎంఎఫ్‌ను బలోపేతం చేస్తూ సమకూర్చనున్న 450 బిలియన్ డాలర్లలో ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ 75 డాలర్లు అందించేందుకు సమ్మతించగా.. అందులో 10 బిలియన్ డాలర్లు భారత్ సమకూర్చనుంది. భారత్ వివిధ అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతున్న అవినీతి అంశంపైనా జీ-20 సదస్సు స్పందించింది. 

జీ-20 సభ్య దేశాలతో పాటు, ఇతర భాగస్వామ్య దేశాలు కూడా అవినీతి జాడ్యంపై పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించాలని, అవినీతి సొమ్ముకు భద్రత కల్పించటానికి నిరాకరించాలని సదస్సు డిక్లరేషన్ పిలుపునిచ్చింది. ‘అవినీతి సొమ్మును భద్రంగా దాచుకునే అవకాశాలు కల్పించకుండా నిరాకరించటానికి, దొంగిలించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి మేం పునరంకితమవుతున్నాం’ అని స్పష్టంచేసింది. 

స్వీయ రక్షణ ధోరణి ఆందోళనకరం: వాణిజ్య అంశాలను ప్రస్తావిస్తూ.. స్వీయ రక్షణ ధోరణి ఉదంతాలు పెరుగుతుండటం పట్ల జీ-20 సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. స్థిరమైన ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు, ఉద్యోగాల కల్పనకు, అభివృద్ధికి.. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, మార్కెట్ల విస్తరణ అవసరమని.. వాటిని అమలుచేయటానికి, రక్షణ ధోరణులను అన్ని రూపాల్లోనూ ప్రతిఘటించటానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. 

అసమానతలు తగ్గించటానికి కృషిచేస్తామని, చమురు ధరలు, ఇతర నిత్యావసర ధరలపైనా అప్రమత్తంగా ఉంటామని కూడా ఈ డిక్లరేషన్‌లో ప్రకటించారు. జీ-20లోని యూరో ప్రాంత సభ్య దేశాలు.. తమ ప్రాంతాల్లో ఆర్థిక సుస్థిరతకు అవసరమైన చర్యలు చేపడతాయని, ఆర్థిక రంగ సమస్యలను పరిష్కరిస్తాయని పేర్కొన్నారు. అలాగే.. ఐఎంఎఫ్‌లో సంస్కరణల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కోటా ఫార్ములా సంపూర్ణ సమీక్షను, ప్రస్తుత విధానంలోని లోపాలను పరిష్కరించటాన్ని 2013 జనవరి నాటికి పూర్తిచేస్తామని వెల్లడించింది. 

కోటాలు నెమ్మదిగా సాగుతున్నాయ్: మన్మోహన్
ఐఎంఎఫ్ కోటా సంస్కరణలు చాలా నెమ్మదిగా సాగుతుండటం పట్ల మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోటాలు ఆర్థిక బలాలను సరళంగా, పారదర్శకంగా ప్రతిబింబించాలన్నారు. జీ-20 సదస్సులో ఆయన మంగళవారం రెండోసారి మాట్లాడుతూ.. నిధుల సమీకరణ కన్నా కోటా సంస్కరణలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని విచారం వ్యక్తంచేశారు. 

2013 జనవరి నాటికి పూర్తి కావాల్సిన కోటా సమీక్ష నిర్ణీత సమయానికి పూర్తికావ

No comments:

Post a Comment