కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్(84) మృత్యువుకు చేరువయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మంగళవారం యూరా జైలు నుంచి సైనిక ఆస్పత్రికి తరలించారు. ఆయన ‘క్లినికల్ డెత్’కు గురయ్యారని వార్తలు వచ్చాయి. గుండె పనిచేయని కారణంగా రక్తప్రసరణ, శ్వాస ఆగిపోవడాన్ని క్లినికల్ డెత్ అంటారు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి గుండెను కరెంట్ షాకులివ్వడం(డీఫిబ్రలేషన్) వంటి చికిత్సలతో తిరిగి పనిచేయించే అవకాశం ఉంటుంది. ముబారక్‌కు యూరా జైల్లో డీఫిబ్రలేషన్ చేశాక మాది ఆస్పత్రికి తరలించారని, ఆయన క్లినికల్ డెత్‌కు గురయ్యారని వైద్యులను ఉటంకిస్తూ ఈజిప్టు వార్తాసంస్థ మెనా తెలిపింది
No comments:
Post a Comment