Arts Blogs - Blog Rankings U70mm: దాదాకే రాష్ట్రపతి పీఠం!

Friday, 22 June 2012

దాదాకే రాష్ట్రపతి పీఠం!

మద్దతుపై ఉత్కంఠకు తెరదించిన బీజేపీ.. సంగ్మాకే బాసట
బీజేపీతో విభేధించిన జేడీయూ 
ప్రణబ్‌కే మద్దతిస్తామంటూ బీజేపీకి షాక్

న్యూఢిల్లీ:తేలిపోయింది.. ఎవరు ఎటువైపో స్పష్టమైంది.. రాష్ట్రపతి ఎన్నికల ముఖచిత్రం ఆవిషృ్కత మైంది! ప్రధాన కూటముల వైఖరులు తేటతెల్లమయ్యాయి!! బలాబలాల ప్రకారం కొత్త రాష్ట్రపతిపై కూడా స్పష్టత వచ్చింది. యూపీఏ కూటమి తరఫున బరిలోకి దిగుతున్న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటిదాకా తమ అభ్యర్థిపై కొనసాగిస్తున్న సస్పెన్స్‌కు బీజేపీ గురువారం తెరదించింది. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాకు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన జేడీ(యూ) విభేదించింది. తాము సంగ్మాకు మద్దతు ఇవ్వబోమని, ప్రణబ్ వైపునే నిలుస్తామని కుండబద్దలు కొట్టింది. 

No comments:

Post a Comment