Arts Blogs - Blog Rankings U70mm: కిలిమంజారో కింగ్..

Thursday, 21 June 2012

కిలిమంజారో కింగ్..

చిన్నపాటి వైఫల్యాలకు, వైకల్యాలకు కుంగిపోయేవారెందరో.. అలాంటివారు కెనడాలోని టొరెంటోకు చెందిన స్పెన్సర్ వెస్ట్(31)ను చూసి నేర్చుకోవాల్సిందెంతో ఉంది. ఎందుకంటే.. చిన్నప్పుడే జన్యుపరమైన వ్యాధి వల్ల ఇతడి కాళ్లు పూర్తిగా ఎదగకపోవడంతో.. స్పెన్సర్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేసి.. కాళ్లు తీసేశారు. అయితేనేం.. చేతులనే ఆయుధాలుగా చేసుకుని.. ఎలాంటి అంగ వైకల్యం లేని వారికి కూడా కష్టసాధ్యమైన.. ఫీట్‌ను స్పెన్సర్ సాధ్యం చేసి, చూపించాడు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను(19 వేల అడుగుల ఎత్తు) చేతుల సాయంతో అధిరోహించాడు. ఈనెల 12న మొదలైన స్పెన్సర్ సాహసయాత్ర సోమవారం విజయవంతంగా ముగిసింది. అంతేకాదు.. ఈ యాత్ర ద్వారా కెన్యాలో కరువు పీడిత ప్రాంతాల్లోని పిల్లల కోసం రూ.2.6 కోట్లను సేకరించాడు.

No comments:

Post a Comment