సముద్రాన్ని ఈదేయడం ఎవరికైనా సాధ్యమా? స్పెయిన్‌లోని లేనెస్ నగరానికి సమీపంలో ఉన్న ఈ గుల్పియురీ సముద్రాన్ని మనం కూడా సింపుల్‌గా ఈదేయచ్చు. ఎందుకంటే.. అటు తిప్పి.. ఇటు తిప్పి కొట్టినా.. ఈ సముద్రం 40 మీటర్లకు మించి ఉండదు. అలాగే పెద్ద లోతూ ఉండదు. అయితేనేం.. ఆశ్చర్యకరంగా ఇక్కడ కెరటాలూ వస్తాయి. చుట్టూ పచ్చని కొండల మధ్య ఉన్న ఈ అరుదైన బీచ్ పర్యాటకులను ఎంతగానో అలరిస్తోంది. ఇంతకీ ఈ బుల్లి సముద్రం ఎలా ఏర్పడిందో తెలుసా? ఈ బీచ్‌కు 100 మీటర్ల దూరంలో బే ఆఫ్ బిస్కే సముద్రం ఉంది. ఈ బుల్లి బీచ్‌లోని నీళ్లు ఈ సముద్రంలోనివే. లక్షల ఏళ్లుగా బే ఆఫ్ బిస్కే కెరటాలు ఈ పర్వత సానువులను ఢీకొంటూ ఉండటం వల్ల.. పర్వతాల కిందన చిన్నపాటి సొరంగంలాంటిది ఏర్పడింది. దాంట్లోంచి సముద్ర జలాలు రావడంతో ఈ గుల్పియురీ బీచ్ ఏర్పడింది. గుల్పియురీని ప్రపంచంలో అత్యంత బుల్లి బీచ్‌గా భావిస్తున్నారు.
No comments:
Post a Comment