బళ్లారి అర్బన్ (కర్ణాటక), న్యూస్‌లైన్: బళ్లారిలో ‘తాజ్‌మహల్’ను నిర్మిస్తున్నారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న చేనేత హస్తకళల ప్రదర్శనలో భాగంగా సందర్శకులకు కనువిందుచేసేలా తాజ్‌మహల్, ఎర్రకోట నమూనాలను ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు, బీహార్, మహారాష్ర్టల నుంచి వచ్చిన సుమారు 300 మంది కళాకారులు 15 రోజులుగా వీటిని నిర్మిస్తున్నారు. తాజ్‌మహల్ 70 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు.. ఎర్రకోట 50 అడుగుల ఎత్తు, 160 అడుగుల వెడల్పు ఉన్నాయి
No comments:
Post a Comment