Arts Blogs - Blog Rankings U70mm: చిరుకు నాన్ బెయిలబుల్ వారంట్

Thursday, 21 June 2012

చిరుకు నాన్ బెయిలబుల్ వారంట్

సిప్‌కాట్ (తమిళనాడు), న్యూస్‌లైన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి హోసూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు-1 బుధవారం నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హోసూరు శాసనసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే గోపీనాథ్‌కు మద్దతుగా 2011 ఏప్రిల్ 9న చిరంజీవి ప్రచారం చేశారు. 

ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా చిరంజీవి కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడం, భారీ ఎత్తున కటౌట్లు, బ్యానర్లతో ఆర్భాటాలు చేశారని అప్పటి ఎన్నికల పర్యవేక్షణ అధికారి ప్రశాంత్ మువడ్నేరి ఫిర్యాదు చే శారు. దీంతో మొదటి నిందితుడిగా హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్, రెండవ నిందితుడిగా సినీ నటుడు చిరంజీవి, బాగలూరు మాజీ సర్పంచ్ మురళీకుమార్ (బాబు), నాగరాజ్, యోగి నారాయణప్ప, క్రిష్ణప్పలపై బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇటీవల విచారణకు వచ్చింది. 

అయితే ఎమ్మెల్యే గోపీనాథ్, ఎంపీ చిరంజీవి ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. గత నెల 7న కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి గజరాజ్ ఆదేశాలు జారీ చేసినా వారిద్దరూ స్పందించలేదు. దీంతో కేసు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. బుధవారం కూడా గోపీనాథ్, చిరంజీవి హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తూ వారిద్దరిని అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేస్తూ.. ఆరోజు వారిద్దరినీ కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు జారీ అయ్యాయి

No comments:

Post a Comment