ఎథెన్స్: గ్రీస్ రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన సంప్రదాయ పార్టీ న్యూ డెమోక్రసీ అధ్యక్షుడు అంటోనిస్ సమరస్(61) బుధవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాటి ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ అతిపెద్ద పార్టీగా అవతరించడం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారీటీ దానికి రాలేదు. దీంతో అది.. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన పసోక్ పార్టీతో, డెమోక్రటిక్ లెఫ్ట్ అనే మరో చిన్న పార్టీతో బుధవారం చర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు వాటిని అంగీకరింపజేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రెండునెలలుగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. మూడు పార్టీల సంకీర్ణ సర్కారు గురువారం ఏర్పాటుకానుంది.
రుణాల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్‌కు పలు దేశాలు అందించిన ఆర్థిక ఉద్దీపనల నిబంధనలను, పొదుపు చర్యలను కొత్త ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. ఉద్దీపనలను వ్యతిరేకించే అతివాద వామపక్షం సిరిజా ఎన్నికల్లో గెలిస్తే గ్రీస్‌ను యూరో కరెన్సీ జోన్ నుంచి బయటకు తెస్తుందని, ఫలితంగా ఆ దేశానికి అప్పులిచ్చిన దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయని భయాందోళన లు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఉద్దీపనల, ఆర్థిక సంస్కరణల అనుకూల న్యూ డెమోక్రసీ విజయంతో యూరప్ దేశాలు కుదుటపడ్డాయి. సమరస్ ప్రధాని కావడంతో గ్రీస్ స్టాక్ మార్కెట్లు కొద్దిగా పైకి ఎగబాకాయి.

No comments:
Post a Comment