Arts Blogs - Blog Rankings U70mm: రెండోసారి రోదసియాత్రకు సునీతా విలియమ్స్

Saturday, 14 July 2012

రెండోసారి రోదసియాత్రకు సునీతా విలియమ్స్

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రెండోసారి అంతరిక్ష యాత్ర చేపట్టారు. కజకిస్థాన్‌లోని బైకొనుర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం ఆమె అంతరిక్ష యానానికి బయలుదేరారు. రష్యా జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన యూరీ మాలెంషెంకో, జపాన్ గగనతల పరిశోధన సంస్థకు చెందిన అకిహికో హోషిడె కూడా సునీతా విలియమ్స్‌తో కలసి అంతరిక్షయానానికి వెళ్లారు. 

సోయుజ్ టీఎంఏ-05 ఎం వ్యోమనౌక ద్వారా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) వెల్లడించింది. ఈ వ్యోమనౌక మంగళవారం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్య వద్దకు చేరుకుంటుందని తెలిపింది. సునీత, అకిహికో నాలుగు నెలల పాటు అంతరిక్షంలో గడపనున్నారు. ఇదివరకు 2006లో తొలిసారిగా అంతరిక్షానికి వెళ్లిన సునీతా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో(ఐఎస్‌ఎస్) ఆరునెలలు గడిపారు.

No comments:

Post a Comment